Friday 9 November 2012

రసాయిన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం


రసాయిన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం
రసాయనం పేరు
:
సల్పూరిక్ ఆమ్లం
గుణాలు
:
రంగు లేని ఓ ద్రావకం , అపాయకరమైనది, చర్మాన్ని తినే గుణం కలది.
ప్రత్యేక ప్రమాదాలు
:
కళ్ళు , చర్మాన్ని మండిస్తుంది మరియు కాన్సర్ రోగం సోకే అవకాశం కలిగిస్తుంది.
ప్రభావానికి గురైయ్యే శరీర భాగాలు
:
మూత్ర పిండాలు, గుండె, ఊపిరి తిత్తులు, శ్వాస కోశ నాళాలు, కళ్ళు , రక్త ప్రసరణా వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది
ప్రథమ చికిత్స
:
కళ్ళులో పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :కళ్ళకు ఈ రసాయనము తగిలినచో ప్రమాదానికి గురైన వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కళ్ళపై రుద్దడం, మూసి ఉంచడం చేయకూడదు. ప్రమాదానికి గురైనప్పుడు  ప్రవాహపు నీటితో కడగాలి (కనీసం 30 నిమిషాల సేపు  ఉంచాలి)
చర్మముపై పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :చర్మానికి ఈ రసాయనము తగిలినచో  వెంటనే తగిలిన చోట సబ్బుతో మరియు నీళ్లతో బాగా కడుగవలెను. (కనీసం 15 నిమిషాల సేపు) . రసాయనము అంటిన బట్టలను తీసివేయవలెను. తిరిగి అదే బట్టలు వాడవలసి వచ్చినచో శుభ్రంగా ఉతికిన తరువాత మాత్రమే వాడవలెను.
నోట్లోకి వెళ్ళినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :ఒకవేళ నోట్లోకి ఈ రసాయనము వెళ్ళినప్పుడు బాధితుడు స్పృహలో ఉన్నట్టయితే రెండు నుండి నాలుగు కప్పులు పాలు గాని, తాగు నీరు గాని ఇవ్వవలెను. బాధితుడు స్పహలో లేక పోయి ఉన్నట్టయితే నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు.
రసాయన వాసనను పీల్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు : ఒకవేళ బాధితుడు రసాయనమును పీల్చినప్పుడు వెంటనే అతడిని మంచి గాలి, వెలుతురు బాగా సోకే ప్రాంతానికి తరలించాలి. ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆక్సిజన్ అందించాలి. నోటి నుండి నోటికి ఊపిరి అందివ్వకూడదు .
వ్యక్తిగత భద్రత
:
ఈ రసాయనము వాడు ప్రదేశములలో తప్పనిసరిగా కంటిని కడుగు (Eye wash ) మరియు భద్రతా నీటి జల్లు( safety shower) అందుబాటులో ఉంచవలెను.
వ్యక్తిగత రక్షణా పరికరములు
:
పని చేయు స్థలంలో కళ్ళకు సరైన రక్షణ కల్పించు కళ్ళ అద్దాలను వాడవలెను. లేదా రసాయనాల నుండి రక్షణ కల్పించు కళ్ల అద్దాలను ధరించవలెను. భద్రతా పరమైన బూట్లు, చేతి తొడుగులు(గ్లౌజులు), ల్యాబ్ కోటు మొదలగునవి తప్పనిసరిగా ధరింప వలెను.




రసాయన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం
రసాయనం పేరు
:
హైడ్రోక్లోరిక్ యాసిడ్
గుణాలు
:
లేత పసుపు రంగులో ఉంచే ద్రావకము
ప్రత్యేక ప్రమాదాలు
:
చర్మానికి కాని, కళ్లకు గాని తాకినప్పుడు అలాగే ఈ ద్రావకాన్ని పీల్చనప్పుడు, నోట్లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదకరము.
ప్రభావానికి గురైయ్యే శరీర భాగాలు
:
కళ్ళు , చర్మము, ఊపిరి తిత్తులు మరియు శ్వాస కోస నాళాలు..
ప్రథమ చికిత్స
:
కళ్లలో పడ్డప్పుడు  ఈ ద్రావకము కంటిలో పడినప్పుడు కళ్ళని నీళ్లతో బాగా కడగాలి. (కనిష్టంగా 15 నిమిషాలు ). చల్లని నీటిని కూడా వాడవచ్చు. వెంటనే సరైన వైద్య సదుపాయం అందించాలి.
చర్మానికి సంబంధించి  ఈ ద్రావకము తగిలిన చర్మాన్ని నీళ్ళతో బాగా కడుగవలెను.  ( కనీసం 15 నిమిషాలు) . రసాయనము పడ్డ బట్టలను , బూట్లను తీసి వేయునప్పుడు అవి మిగిలిన చర్మానికి తగలకుండా తీయవలెను. చల్లని నీటిని కూడా వాడ వచ్చును.
రసాయనము పడిన బట్టలను శుభ్రంగా ఉతికిన తరువాత ధరించవలెను. క్రిములు సోకని సబ్బుతో శరీరమంతా రాయవలెను.  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
రసా.యనమును పీల్చినప్పుడు  బాధితుడిని సురక్షితమైన గాలి వెలుతురు సోకే ప్రాంతానికి వెంటనే తరలించాలి. ఊపిరి తీసుకోవడానకి బాగా ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ ను అందించాలి. వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.
రసా.యనమును నోటి ద్వారా లోనికి వెళ్లినప్పుడు  స్పృహలో లేని బాధితుడికి నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు. వాంతులు చేసుకోవడానికి ఏమీ ఇవ్వకూడదు. బాధితుడు ధరించిన బట్టల్లో కాలరు, టై, బెల్టు లను వదులు చేయవలెను. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వ్యక్తిగత భద్రత
:
స్పష్టంగా కనిపించే కంటి అద్దాలు, ల్యాబ్ కోటు, శ్వాస పీల్చుకొనే రెసిపిరేటర్ లను మరియు కాళ్లకు భద్రాతా బూట్లు , చేతికి తొడుగులు (గ్లౌజులు) తప్పని సరిగా ధరించాలి








రసాయన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం
రసాయనం పేరు
:
కాస్టిక్ సోడా లై
గుణాలు
:
రంగులేని ద్రావకము
ప్రత్యేక ప్రమాదాలు
:
చర్మము, ,కళ్ళు మండుట , శ్వాస కోశ వ్యవస్థ దెబ్బతినుట మరియ జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది.
ప్రభావానికి గురైయ్యే శరీర భాగాలు
:

ప్రథమ చికిత్స
:
కళ్లలో పడ్డప్పుడు  ఈ ద్రావకము కంటిలో పడినప్పుడు పారుతున్న నీటితో కళ్ళను తెరిచి ఉంచి  బాగా కడగాలి. (కనిష్టంగా 15 నిమిషాలు ). చల్లని నీటిని వాడుట మంచిది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చర్మానికి సంబంధించి  ఈ ద్రావకము తగిలిన చర్మాన్ని నీళ్ళతో బాగా కడుగవలెను. 
( కనీసం 15 నిమిషాలు) . రసాయనము పడ్డ బట్టలను తీసివేసి  మరల ధరించేటప్పుడు శుభ్రంగా ఉతికి ధరింపవలెను.
రసా.యన వాసనను  పీల్చినప్పుడు  బాధితుడిని సురక్షితమైన గాలి వెలుతురు సోకే ప్రాంతానికి వెంటనే తరలించాలి. ఊపిరి తీసుకోవడానకి బాగా ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ ను అందించాలి. వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

వ్యక్తిగత భద్రత
:
స్పష్టంగా కనిపించే కంటి అద్దాలను వాడాలి. ల్యాబ్ కోట్, కాళ్ళకు భద్రతా బూట్లు, చేతికి గ్లౌజులు వాడాలి.


















రసాయన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం
రసాయనం పేరు
:
ఫెరిక్ క్లోరైడ్
గుణ గుణాలు
:
నల్లని రంగు గల పౌడర్ రూపంలో  ఉంటుంది
ప్రత్యేక ప్రమాదాలు
:
నోటితో పీల్చిన, శరీరములోనికి ప్రవేశించి, చర్మానికి తగిలిన, చర్మము కాలును. ఎక్కువగా తుప్పు పట్టును.
ప్రథమ చికిత్స
:
కళ్లలో పడ్డప్పుడు  ఈ పొడి  కంటిలో పడినప్పుడు పారుతున్న నీటితో కళ్ళను తెరిచి ఉంచి  బాగా కడగాలి.  చల్లని నీటిని వాడుట మంచిది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చర్మానికి సంబంధించి  ఈ పొడి చర్మానికి తగిలిన వెంటనే చల్లని నీటితో 15 నిమిషాల పాటు బాగా కడుగవలెను.  వెంటనే తగిన వైద్యం చేయించవలెను.
నోటిలోనికి వెళ్ళినప్పుడు  శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కృతిమ శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ ని అందించవలయును.
రసా.యన వాసనను  పీల్చినప్పుడు   వ్యక్తి స్పృహలో లేనప్పుడు నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు. బిగుతుగా ఉన్న బట్టలను, వస్తువులను శరీరం నుండి తీసివేయవలెను. ఉదాహరణకు కాలరు, టై, బెల్టు మరియు రిస్టు బ్యాండు మొదలగునవి.
వైద్యుడి సూచనలేకుండా ఏమీ చేయకూడదు.

వ్యక్తిగత భద్రత
:
ఈ రసాయనమును ఉపయోగించు సమయంలో తప్పనిసరిగా గాలి, వెలుతురు బాగా ఉండవలయును. పనిచేయు స్థలములో కాళ్ళకు, చేతులకు మరియు కళ్ళకు సరియైన రక్షణ కల్పించు పరికరములు విధిగా ధరించవలెయును. ఉదాహరణకు కళ్ళ అద్దాలు, బూట్లు, గ్లౌజులు మొదలగునవి.















రసాయన వస్తువుల భద్రత ధృవీకరణ పత్రం
రసాయనం పేరు
:
క్లోరిన్
గుణ గుణాలు
:
ఇది గ్యాస్ రూపంలో ఉంటుంది. (వాయువు)
ప్రత్యేక ప్రమాదాలు
:
ఈ క్లోరిన్ వాయువు అతి ప్రమాదకరమైనది. విషపూరితమైనది మరియు తినివేయు గుణము కలది. మండేగుణము గల వస్తువులు ప్రాణ వాయువు(ఆక్సిజన్)తో కలసి ఎలా మండుతాయో అలాగే క్లోరిన్ వాయువు కూడా అలాగే మండే స్వభావం కలది.
ప్రథమ చికిత్స
:
ఈ వాయువు  పీల్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు   బాధితుడిని సురక్షితమైన గాలి వెలుతురు సోకే ప్రాంతానికి వెంటనే తరలించాలి. ఊపిరి తీసుకోవడానకి బాగా ఇబ్బంది పడుతుంటే కృతిమ శ్వాస ఆక్సిజన్ ను అందించాలి. ఒకవేళ గుండె ఆగినప్పుడు చేతులతో గుండెపై బాగా నొక్కాలి. నోటి నుండి నోటికి ఊపిరి అందించకూడదు. వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.క్లోరిన్ లీకు అరికట్టడానికి వెళ్ళేటప్పుడు సరైన భద్రతా పరికరములు ధరించాలి.
ఈ వాయువు  కళ్లకు తగిలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు   ఈ వాయువు  కళ్ళకు తగిలిన వెంటనే గోరు వెచ్చని నీటితో కడగాలి. పారే నీటిలో కంటి రెప్పలు తెరిచి ఉంచి నీరు కంటికి తగిలేటట్టు కనీసము ఇరవై నిమిషములు ఉంచాలి. వాయువు సోకిన కంటిని కడిగేటప్పుడు ఆ నీరు పక్క కంటిలోనికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒక వేళ వాయువు సోకిన కంటికి చీదర వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
చర్మానికి తగిలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు     వీలయినంత త్వరగా వాయువు సోకిన చర్మాన్ని గోరు వెచ్చని నీటితో కడగాలి. పారే నీటితో చర్మాన్ని కనీసము 20 నిమిషాల సేపు కడగాలి.  పారే నీటి క్రింద  వాయువు సోకిన బట్టల్ని, బూట్లని, బెల్టుని తీసివేయాలి. చీదర వస్తే వైద్యున్ని సంప్రదించాలి.
కంటి మొఖము భ్రదత    గాలి వెళ్లకుండా ఉండే కంటి అద్దాలు, మొఖాన్ని కప్పి ఉంచే తొడుగులు వాడాలి.
వ్యక్తిగత భద్రత
:
చేతులకు గ్లౌజులు, కాళ్ళకు బూట్లు, శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే ల్యాబ్ కోటు ఆక్సిజన్ అందించే యంత్రాలు వాడాలి. క్లోరిన్ వాయువు దగ్గర పని చేసేటప్పుడు కళ్ళు కడుక్కునే యంత్రము మరియు భద్రతా నీటి జల్లు అందుబాటులో ఉంచాలి.


Monday 29 October 2012

భద్రత తెలుగులో మీ కోసం

ప్రియమైన పాఠకులకు

పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే పరిశ్రమలలో భద్రతపై ఆంగ్లములో చాలా విషయాలు ఉన్నా తెలుగులో అందుబాటులో లేదు. ఆ కొరతను తీర్ఛడానికి అందరికీ ఉపయుక్తంగా ఉండడానికి గాను ఈ బ్లాగు తయారు చేయడానికి పూనుకున్నాము. వివిధ సందర్బరాలలో ఇంగ్లీషు నుండి తెలుగుకు అనువాదం చేసిన భద్రతా పరమైన విషయాలను మీకోసం ఇక పై ఉంచుతాము. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించగలరు

ఇట్లు
కరణం లుగేంద్ర పిళ్ళై